హైదర్ నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): డివిజన్ పరిధిలోని నాగార్జున హోమ్స్ సంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యులు ప్రభుత్వ ఆరెకపూడి గాంధీ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను సన్మానించిన గాంధీ అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేయాలనీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. గాంధీని కలిసిన వారిలో నూతనంగా నియమితమైన కమిటీ ప్రతినిధులు ప్రెసిడెంట్ ఓంకార్ , జనరల్ సెక్రటరీ రత్న కుమార్, వైస్ ప్రెసిడెంట్స్ భాస్కర్ రావు, హరిప్రసాద్, క్యాషియర్ వినోద్, జాయింట్ సెక్రటరీ డీఎస్ రాజు, లలిత, ఆర్గనైజింగ్ సెక్రటరీ వాసు, చీఫ్ అడ్వైజర్ మురళీధర్ రావు , రాంబాబు రాజు, కమిటీ సభ్యులు సీత , పద్మ శ్రీ, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు నార్నె శ్రీనివాస రావు, నాయకులు రంగరాయ ప్రసాద్, కోనేరు కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.