నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ నెల 27న మాదాపూర్ లోని హెచ్ఐసీసీ లో నిర్వహించే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లను ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. ప్లీనరీకి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. వేసవికాలం దృష్ట్యా మంచినీటి వసతి మొదలు ట్రాఫిక్ సమస్య లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. వారి వెంట టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్, ట్రాఫిక్ డీసీపీ సందీప్, ఏసీపీ హనుమంతరావు, ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.