మోడల్ మార్కెట్ పై అపోహలను తొలగించండి – బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: మోడల్ మార్కెట్ నిర్మాణంపై వస్తున్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ తీసుకోవాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల కూరగాయల మార్కెట్ ని స్థానిక బిజెపి నాయకులతో కలిసి బుచ్చిరెడ్డి పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ ఈ కూరగాయల మార్కెట్ ను సందర్శించి, కొత్తగా మోడల్ మార్కెట్ నిర్మిస్తామని హామినిచ్చారని, ప్రక్కనే ఉన్న కూకట్ పల్లి, పఠాన్ చెరు లో నిర్మించిన అసంబద్ద మోడల్ మార్కెట్ తో వ్యాపారులకు ఎలాంటి ఉపయోగం‌లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

నల్లగండ్ల కూరగాయల మార్కెట్ లో వ్యాపారులతో మాట్లాడుతున్న 

 

నల్లగండ్ల లో మోడల్ మార్కెట్ నిర్మాణంపై వ్యాపారులకు ఎన్నో అపోహలకు దారి తీస్తుందన్నారు‌‌. 2006 సంవత్సరంలో నల్లగండ్ల కూరగాయల మార్కెట్ ను తరలించడాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి ఆధ్వర్యంలో సుమారు 48 గంటల ఆమరణ దీక్ష చేసి, రోడ్డుపై ఉన్న మార్కెట్ ను, ప్రక్కన ఉన్న స్థలంలో మార్కెట్ ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. మార్కెట్ లోని దుకాణదారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా బిజెపి తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. మరోపక్క ఈ మార్కెట్ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్నారనే అనుమానం వ్యక్తం చేశారు. మార్కెట్ ను తరలించాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్, మారం వెంకట్, గొల్లపల్లి రాంరెడ్డి, శాంతి భూషణ్ రెడ్డి, గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here