నమస్తే శేరిలింగంపల్లి: నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ లెవల్ 2 లో మదీనాగూడ నారాయణ ఒలంపియాడ్ పాఠశాల విద్యార్థినీ ఘన విజయం సాధించింది. మదీనాగూడ నారాయణ ఒలంపియాడ్ పాఠశాలకు చెందిన యనమల షామిలీ అనే విద్యార్థిని నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ లో మంచి ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత పొంది స్కాలర్ షిప్ అర్హత సాధించింది. రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీ లక్ష్మీ, ప్రధానోపాధ్యాయులు రాధికా, డీజీఎం గోపాల్ రెడ్డి, ఏజిఎం వేణుగోపాల్ విద్యార్థిని యనమల షామిలి ని కలిసి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.