నమస్తే శేరిలింగంపల్లి: మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకులు బిక్షపతి యాదవ్ ను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు రాజకీయంలో ఓనమాలు నేర్పి కార్పొరేటర్ గా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన బిక్షపతి యాదవ్ కు పాదాభివందనం చేస్తున్నట్లు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గా గెలుపొంది ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యదవ్ ఆశీర్వాదం తీసుకోవడం జరిగిందని అన్నారు. కార్పొరేటర్ గా అవకాశం కల్పించిన బిక్షపతి యాదవ్, యువ నాయకులు రవికుమార్ యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షులు బి విటల్, సీనియర్ నాయకులు శివ సింగ్, మన్నే రమేష్, ప్రసాద్, కిషన్ గౌలి, నర్సింగ్ నాయక్, రంగస్వామి, దుర్గారామ్, ప్రవీణ్, రాజు, శ్రీను, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.