ఏరియా ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు – ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: పేదలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో రూ. 23 లక్షలు అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో అత్యున్నత వైద్య సదుపాయాలు కల్పించి అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఈ ఆస్పత్రిలోని డాక్టర్లు, సిబ్బంది ఎంతో సహనంతో రోగులకు వైద్య సేవలందిస్తూ ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. ఝాన్సీ లక్ష్మి, కొండాపూర్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. వరదాచారి, హెచ్ ఓ డీ అఫ్ గైనిక్ డా. కళావతి, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు అబ్బుల కృష్ణ గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ బలరాం యాదవ్, సీనియర్ నాయకులు నరసింహ సాగర్, రూప రెడ్డి, రవి శంకర్ నాయక్, బుడుగు తిరుపతి రెడ్డి, గణపతి, రజనీకాంత్, తిరుపతి, గిరి గౌడ్, యాదగిరి, డా రమేష్, హనుమంతు రెడ్డి, పీజేఆర్ నగర్ ప్రెసిడెంట్ బిక్షపతి, న్యూ పీజేఆర్ నగర్ ప్రెసిడెంట్ వెంకట్, వెంకటేష్, రామకృష్ణ, వీరేష్, తదితరులు పాల్గొన్నారు.

కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో లిప్ట్ ను ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here