మోదీపై ఈగ వాలినా ఊరుకోం: చింతకింది గోవర్ధన్ గౌడ్ – సురభి కాలనీలో ఉత్సాహంగా మహా మృత్యుంజయ హోమం

నమస్తే శేరిలింగంపల్లి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో ఉండేలా‌ చూడాలని ఆ భగవంతున్ని కోరుకున్నట్లు బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ తెలిపారు. బిజెపి రాష్ట్ర ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ పట్ల పంజాబ్ రాష్ట్రంలో నెలకొన్న సంఘటన దృష్ట్యా మోదీ ఎల్లవేళలా ఆయురారోగ్యలతో చిరంజీవిగా వర్ధిల్లాలని బిజెపి శేరిలింగంపల్లి 106 డివిజన్ అధ్యక్షుడు రాజు శెట్టి కురుమ ఆధ్వర్యంలో సురభి కాలనీ శివాలయంలో నిర్వహించిన మృత్యుంజయ హోమంలో చింతకింది గోవర్థన్ గౌడ్ దంపతులు ముఖ్య అతిథులుగా  పాల్గొన్నారు. వేద మంత్రాలు, పండితుల సమక్షంలో హోమం నిర్వహించారు.

సురభి కాలనీ ఆలయంలో మృత్యుంజయ హోమంలో పాల్గొన్న చింతకింది గోవర్ధన్ గౌడ్, హేమలత దంపతులు

అనంతరం ఆయన మాట్లాడుతూ పంజాబ్ లో మోదీ పై జరిగిన సంఘటన కాంగ్రెస్ ప్రభుత్వ హేయమైన బుద్ధికి నిదర్శనం అన్నారు. మోదీ భారత దేశాన్ని విశ్వ గురువు గా నిలిపేందుకు చేస్తున ప్రయత్నాన్ని, అభివృద్ధి పనులను తట్టుకోలేక కాంగ్రెస్ ఇలాంటి నీచమైన పనులకు తెగబడుతుందని ఎద్దేవా చేశారు. మోదీ పై ఈగ వాలిన ఊరుకోం అని, ఎంతటి సహసానికైన సిద్ధమన్నారు. మోదీ చిరంజీవిగా కలకాలం వర్ధిల్లాలని, దేశానికి మార్గదర్శకం చెయ్యాలని ఆ మహా శివుడిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బిజెపి ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి కాంచన కృష్ణ , సీనియర్ నాయకులు అశోక్ బాల్ద, నర్రా జయ లక్ష్మి, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి అందెల కుమార్ యాదవ్, జిల్లా మేధావుల సెల్ కన్వీనర్ రాఘవేంద్ర, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి రాధ మూర్తి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుమ రెడ్డి, జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ వినత సింగ్, జిల్లా ఓ.బీ.సి మోర్చా కార్యదర్శి భారత్ రాజ్, అసెంబ్లీ మహిళ మోర్చా కో కన్వీనర్ బీమని విజయ లక్ష్మి, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్య కుర్మా, ఉపాధ్యక్షులు శ్రావణ్ పాండే, సి. బాలరాజు, బీ.జే.వై.ఎం నాయకులు బొట్టు కిరణ్, మహిళ నాయకులు అరుణ కుమారి, వి. గాయత్రి, స్వాతి, బబ్లీ దేవి, మీన, అంకమ్మ, నివేదిత, బీ. సత్య నారాయణ, వీ.హెచ్.పి నాయకులు బండాడి కృష్ణ, రవీంద్ర, పి, వివేక్, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

 

మహా మృత్యుంజయ హోమం లో పాల్గొన్న బిజెపి నేతలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here