నమస్తే శేరిలింగంపల్లి: నడిగడ్డ తండాలో బిజెపి నాయకులు చేపట్టిన బస్తీ బాటలో అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ స్వామి నాయక్ అన్నారు. బిజెపి అసెంబ్లీ ఇంచార్జీ గజ్జల యోగానంద్ నడిగడ్ట తండాలో బస్తీ బాట చేపట్టి అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే, కార్పొరేటర్ పై అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. బస్తీలో చేపట్టిన అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బిజెపి నాయకులకు చేతనైతే బస్తీ మొదట్లో ఉన్న సీఆర్పీఎఫ్ పై మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తండా నాయకులు తిరుపతి నాయక్, హనుమంతు నాయక్, ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి లక్ పతి నాయక్, కమలాకర్, సుధాకర్, లక్స్ మన్ నాయక్, మోతిరాం నాయక్, ఆంజనేయులు చారి, శేఖదార్ తదితరులు పాల్గొన్నారు.
