శేరిలింగంపల్లి, జూలై 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ గంగారంలో ఉన్న భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీని ముగ్గురు వ్యక్తులు దొంగిలించారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్ గంగారంలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఉన్న హుండీని ముగ్గురు వ్యక్తులు చోరీ చేశారు. అనంతరం పక్కనే ఉన్న చెరువు వద్ద హుండీని పగలగొట్టి అందులో ఉన్న నగదును దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హుండీని దర్యాప్తు నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితులను గుర్తిస్తున్నట్లు తెలియజేశారు.






