శేరిలింగంపల్లి, జూలై 7 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్‌పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీకి చెందిన డాక్టర్ సుజిత్ మోహన్ , శ్రీదివ్య దంపతుల పిల్లలు 8 ఏళ్ల కుమార్తె దృశ్య మీనన్ 6 ఏండ్ల కుమారుడు దృవీత్ మీనన్ హనుమాన్ చాలీసాను అత్యంత వేగంగా పారాయణం చేసి ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్స్, యంగ్ అచీవర్స్ విభాగంలో అత్యుత్తమ విజయాన్ని సాధించి, అంతర్జాతీయ కిడ్స్ ఐకాన్ అవార్డు 2025ను పొందిన సందర్భంగా చిన్నారులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ చిన్నారులు అతి తక్కువ సమయంలో అత్యంత వేగంగా పారాయణం చేసి రికార్డు సృష్టించడం చాలా గొప్ప విషయం అని అన్నారు. అందరికీ గర్వకారణం అని తెలిపారు. 2 నిమిషాల కంటే తక్కువ సమయంలో హనుమాన్ చాలీసాను పఠించే తమ అద్భుతమైన సామర్థ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచారని అన్నారు. భవిష్యత్తులోనూ వారు ఇలాగే అనేక రికార్డులను నెలకొల్పాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి , శ్రీధర్ రెడ్డి, బ్రిక్ శ్రీనివాస్, అనిల్, తిరుపతి, కుమార్, శ్రీకాంత్, కరుణ తదితరులు పాల్గొన్నారు.






