శేరిలింగంపల్లి, జూలై 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన సీపీఐ 4వ మహాసభలో కార్యదర్శిగా రామకృష్ణ, సహాయ కార్యదర్శిగా కె.చందుయాదవ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని, పార్టీ నిబంధనల ప్రకారం నడుచుకుంటూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నియోజకవర్గం పరిధిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంట పర్వతాలు, నాయకులు పాల్గొన్నారు.