శేరిలింగంపల్లి, జూలై 7 (నమస్తే శేరిలింగంపల్లి): మహిళ శక్తి వేడుకలలో భాగంగా వివేకానంద నగర్ లోని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ కార్యాలయంలో జరిగిన కూకట్పల్లి పట్టణ మహిళా సమాఖ్య సర్కిల్- 24 పరిధిలోని కూకట్పల్లి (పార్ట్), వివేకానంద నగర్ ,హైదర్ నగర్ ,ఆల్విన్ కాలనీ డివిజన్ల పరిధిలోని స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, సభ్యులతో జరిపిన సమావేశంలో డీసీ గంగాధర్, కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, ప్రాజెక్టు ఆఫీసర్ రాజశేఖర్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ వడ్డీ లేని రుణాలు 2023-24, 2024-25 (2023 నుండి 2025 వరకు ఎంపిక అయిన 1447 SHG సంఘాల కు Rs.2,80,36,790 మంజూరు అయ్యాయని, వడ్డీ లేని రుణాలు మంజూరు అయ్యాయని , లోన్, ప్రమాద భీమా లభిస్తుందని అన్నారు. మహిళ శక్తి స్కీమ్ చాలా గొప్ప స్కీమ్ అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, దొడ్ల రామకృష్ణ గౌడ్, పోతుల రాజేందర్ , MD ఇబ్రహీం, చంద్రమోహన్ సాగర్ , CO లు పాపయ్య గౌడ్, ముస్తఫ్ఫా , సుజాత, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






