శేరిలింగంపల్లి, జూలై 7 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జలమండలి కార్యాలయం, చందానగర్ లోని జిహెచ్ఎంసి సర్కిల్ 21 కార్యాలయాలలో పాల్గొని మియాపూర్ డివిజన్ పరిధిలోనీ పలు కాలనీలలో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జలమండలి GM శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి, DGM నారాయణలతో కలసి నిర్వహించిన సమీక్ష సమావేశలలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా పని చేయాలని అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని , ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తయ్యేలా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు తొందరగా పూర్తయ్యేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు మేనేజర్లు సునీత, శిరీష, శ్రీహరి, లోకేష్, అరుణ్, జిహెచ్ఎంసి పలు శాఖల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.