కొంటు సుమన్ కు బేరి రామచంద్ర యాదవ్ శుభాకాంక్ష‌లు

శేరిలింగంప‌ల్లి, జూలై 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మల్కాజిగిరి మేడ్చల్ పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె శ్రీనివాస్ ఆధ్వర్యంలో వరంగల్ పట్టణంలో శ్రీ కన్వెన్షన్ హంటర్ రోడ్ వేడుక మందిరంలో ప్రమాణ స్వీకారంచేసిన మేదరి మహేంద్ర సంఘం రాష్ట్రయువజన అధ్యక్షుడు కొంటు సుమన్, కార్యవర్గానికి బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు ముఖ్య సలహాదారు పట్లూరి కృష్ణమోహన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, హైందవి విద్యాసంస్థల అధినేత గడ్డం శ్రీనివాస్ యాదవ్, అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్, కృష్ణ యాదవ్ త‌దిత‌రులు కొంటు సుమన్ కి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయ‌న‌ను భ‌విష్య‌త్తులో మ‌రిన్ని ప‌ద‌వులు వ‌రించాల‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మేదరి మహేంద్ర సంఘం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు కొంటు ముకుందం, నిజామాబాద్ ముఖ్య నాయకుడు, లాయర్ సుదర్శన్, బీసీ ఐక్యవేదిక నాయకుడు గౌరవ అధ్యక్షుడు తమ్మా చంద్రమౌళి, సిద్ధార్థ ముదిరాజు, శీను పటేల్, చైర్మన్ ఇస్మాయిల్, చేతిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here