డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం – ఆదిత్య నగర్ లో పర్యటించిన ఎంపీ రంజిత్ రెడ్డి, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో రైల్వే శాఖ ద్వారా నెలకొన్న యూజీడీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని చేవెళ్ళ పార్లమెంటు సభ్యులు డాక్టర్ గడ్టం రంజిత్ రెడ్డి చెప్పారు. మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ అధీనంలో ఉన్న స్థలంలో నుంచి నూతనంగా నిర్మించాల్సిన డ్రైనేజీ ఔట్ లేట్, బస్తీలో చేపటాల్సిన అభివృద్ధి పనులను జోనల్ కమిషనర్ ప్రియాంక అల, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, స్థానిక బస్తి నాయకులతో కలిసి ఎంపీ రంజిత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఆదిత్య నగర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 90శాతం పూర్తి చేయడం జరిగిందని, హాఫీజ్ పెట్ రైల్వే స్టేషన్ బస్తీకి అనుకొని ఉండడంతో డ్రైనేజీ సమస్య‌ నెలకొందని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. రైల్వే పరిధిలో నుంచి డ్రైనేజీ ఔట్ లెట్ నిర్మాణం చెప్పటి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం అయ్యేలా చూస్తామని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం మాల్యా దృష్టికి డ్రైనేజీ ఔట్ లేట్ నిర్మాణం విషయం గురించి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతి, డీఈ స్రవంతి,‌ ఏఈ ప్రశాంత్, వాటర్ వర్క్స్ మేనేజర్ ఇల్వర్తి, మాదాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ సాంబశివరావు, నల్ల సంజీవ రెడ్డి, సయ్యద్ గౌస్, సర్వర్, సుభాష్ చంద్రబోస్ నగర్ టిఆర్ఎస్ బస్తి అధ్యక్షుడు ముక్తర్, కృష్ణ కాలనీ టిఆర్ఎస్ బస్తీ అధ్యక్షులు కృష్ణ యాదవ్, మాదాపూర్ డివిజన్ మైనారిటీ అధ్యక్షులు రహీం, నాయకులు బాబూమియా, సలీం, మియన్, మాదాపూర్ డివిజన్ యూత్ అధ్యక్షులు షైక్ ఖాజా, ఆదిత్య నగర్ యూత్ అధ్యక్షులు మొహమ్మద్ ఖాజా, మహమ్మద్, బాషరత్, ఇమ్రాన్, నర్సింహ, మహిళలు ఉమాదేవి,రాణి,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

ఆదిత్య నగర్ లో పర్యటించిన ఎంపీ రంజిత్ రెడ్డి, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here