భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల తొలగింపు.. స్థానికుల ధ‌న్య‌వాదాలు..

శేరిలింగంప‌ల్లి, జూలై 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ర‌హదారిపై ఉన్న భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల‌ను తొల‌గించినందుకు గాను వార్డు మెంబ‌ర్ రాంబాబు, జీహెచ్ఎంసీ ఏఈ భాస్క‌ర్‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నామ‌ని పాపిరెడ్డి న‌గ‌ర్ వాసి జి.రోహిత్ ముదిరాజ్ తెలిపారు. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని పాపిరెడ్డి కాల‌నీలో స్థానికుల ర‌వాణా సౌక‌ర్యం కోసం ర‌హ‌దారుల‌ను నిర్మించ‌డం జ‌రిగింద‌న్నారు. కానీ భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల‌ను ర‌హ‌దారిపై వేయ‌డంతో పాద‌చారులు, వాహ‌న‌దారుల‌కు ఇబ్బందిగా మారింద‌న్నారు. ఇదే విష‌యంపై వార్డు మెంబ‌ర్ రాంబాబు, ఏఈ భాస్క‌ర్‌కు ఫిర్యాదు చేశామ‌ని, దీంతో వారు వెంట‌నే స్పందించి నిర్మాణ వ్య‌ర్థాల‌ను తొల‌గింప‌జేశార‌ని అన్నారు. ఇందుకు వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నామ‌ని చెప్పారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here