శేరిలింగంపల్లి, జూలై 7 (నమస్తే శేరిలింగంపల్లి): మహిళాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ప్రత్యేక పట్టణ మహిళా సమైక్య మీటింగ్ ను కార్పొరేటర్ వార్డ్ ఆఫీసులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలకు రావాల్సిన వడ్డీ లేని రుణాలను 2023 – 2024, 2024- 2025 సంవత్సరానికి గాను ప్రభుత్వము ఈ వారంలో జమ చేయడానికి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వార్డ్ స్థాయిలో సమైక్య మీటింగ్‌లను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలను అందరికీ తెలియజేయవలసిందిగా సూచించమని అన్నారు. సర్కిల్ పరిధిలో మంజూరైన వడ్డీ లేని రుణాల చెక్కులను త్వరలోనే నియోజకవర్గం వారీగా పంపిణీ కార్యక్రమం చేపడతామని అన్నారు. ప్రతిఒక్క మహిళ స్వయం సహాయక సంఘాలలో చేరి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతోపాటు ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకుల ద్వారా రుణాల సదుపాయం పొంది అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, ప్రాజెక్ట్ ఆఫీసర్ నాగమల్లేశ్వరి, కమ్యూనిటీ ఆర్గనైజర్ శ్రీకాంత్, యూసీడి సిబ్బంది, టీ ఎల్ ఎఫ్ అధ్యక్షురాలు వీణ, శేరిలింగంపల్లి సమైక్య అధ్యక్షురాళ్లు, ఆర్ పీ లు తదితరులు పాల్గొన్నారు.






