నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిఖ్ నగర్ వాసుల విజ్ఞప్తి మేరకు మంగళవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి కాలనీలో పర్యటించారు. సిద్దిఖ్ నగర్ లో మిగిలిన ఉన్న రోడ్లను ఫిబ్రవరి నెలలోపు పూర్తి చేసేందుకు కార్యచరణ రూపొందించి నిధులు విడుదల చేశామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాలు మేరకు అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. కొండాపూర్ డివిజన్ అభివృద్ధికి కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి, అధికారులతో కలసి శాయశక్తుల పని చేస్తున్నామని తెలిపారు. సిద్దిఖ్ నగర్ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం బస్తీ నాయకులు, బస్తీ వాసులు ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు అబ్బుల కృష్ణగౌడ్, జీహెచ్ఎంసి డీఈ రమేష్, ఎలక్ట్రికల్ ఏఈ రాజశేఖర్, వాటర్ బోర్డు డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణ, మేనేజర్ నివర్తి, సిద్దిఖ్ నగర్ బస్తీ అధ్యక్షుడు బసవ రాజు, సీనియర్ నాయకులు పెరుక రమేష్ పటేల్, నందు, నరసింహ సాగర్, తిరుపతి యాదవ్, చారీ, బుడుగు తిరుపతి రెడ్డి, యాదగిరి, బద్ధం భాస్కర్, బండ కుమార్, సాగర్ చౌదరి, లక్ష్మణ్ గౌడ్, రవి శంకర్ నాయక్, కుమార్, గణపతి, రాము యాదవ్, నరేష్ ముదిరాజ్, వినయ్, మహేష్, శ్రావణ్, యాదయ్య గౌడ్, ఆనంద్, మాల్యాద్రి, కరీం, జుబేర్ తదితరులు పాల్గొన్నారు.