నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాలో వివిధ రాష్ట్రాల నుండి చేనేత హస్తకళా ఉత్పత్తులతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. సాంస్కృతిక ప్రదర్శనల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులు విచ్చేసి ప్రదర్శన ఇచ్చారు. బెంగళూరు నుండి వైష్ణవి నాట్యశాల మిథున్ శ్యామ్ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. పుష్పాంజలి, గణేశా స్తుతి, దేవి స్తుతి, శృంగారపుదీశ్వరి శారదే, దేవర్ణమా జగన్ మోహన్, బ్రోచేవారు ఎవరు ర కృతి, శివ స్తుతి, ఎందరో మహానుభావులు తదితర అంశాలను మాస్టర్ శశాంక్ కిరణ్, కావ్య కాశీనాథన్, గాయత్రీ గురు ప్రసాద్, రితిక, శ్వేతా సునీల్ ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా జయంతి నారాయణ శిష్య బంధం గణపతి ప్రార్ధన, స్వరపల్లవి, శివ పంచాక్షర స్తోత్రం, నటరాజ స్తుతి, శివ పార్వతి తాండవ లాస్యం, వరవీనా గీతం, అన్నమాచార్య కీర్తన, రుక్మిణి ప్రవేశం, గణపతి కౌత్వం, త్యాగరాయ కీర్తన, తిల్లాన, అంశాలను కుమారి ప్రత్యుష, కార్తీక, నైవేద్య, తేజస్వి, గాయత్రీ, సృజన, సాహితి, ఆరాధ్య, శ్రీనిధి తదితరులు ప్రదర్శించారు.