నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ లో నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ను కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ చొరవతో జలమండలి అధికారులు పరిష్కరించారు. నేతాజీ నగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిండి ఇళ్లల్లోకి రావడంతో తరచూ ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ సమస్యను పరిశీలించి జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మేనేజర్ యాదగిరి వెంటనే స్పందించి సూపర్ వైజర్ సురేష్, సిబ్బంది తో నేతాజీ నగర్ కాలనీలో నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున జలమండలి మేనేజర్, సిబ్బందికి భేరి రాంచందర్ యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, రవి నాయక్, లక్ష్మారెడ్డి, కె. రాము యాదవ్, రవి నాయక్, గణేష్ నాయక్, దినేష్, మోహన్ చారి, ఆశా బేగం, శారద, తిరుపతయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.