నమస్తే శేరిలింగంపల్లి: పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అన్ని విధాల అవకాశం కల్పిస్తూ రాజ్యాంగం రచించిన స్ఫూర్తి దాత, ఆదర్శ ప్రాయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని బిజెపి నాయకులు రాధాకృష్ణ యాదవ్ పేర్కొన్నారు. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఇజ్జత్ నగర్ వీకర్ సెక్షన్, బిక్షపతి నగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి రాధాకృష్ణ యాదవ్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ బిజెపి నాయకులు జి. నర్సింహా యాదవ్, మహిళా మోర్చా పద్మ, శ్రీనివాసరెడ్డి, మాదాపూర్ డివిజన్ బిజెపి ఉపాధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, మధుయాదవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి మదనాచారి, ఓబీసీ ప్రధాన కార్యదర్శి సత్యం చారి, కార్యదర్శి కుర్మయ్య, గురుస్వామి, ఎస్టీ సెల్ నాయకులు కృష్ణ, బాలునాయక్, మహిళా మోర్చా ఉపాధ్యక్షులు చంద్రకళ, రేణుక, ప్రధాన కార్యదర్శి భారతి, బాలమణి, బిజెవైఎం నాయకులు చంద్రశేఖర్ యాదవ్, శ్రీధర్, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కసిరెడ్డి భాస్కర రెడ్డి ఆధ్వర్యంలో..
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చందానగర్ లో అంబేద్కర్ విగ్రహానికి బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. అంబేద్కరుని ఆశయాలను కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ ఉపాధ్యక్షుడు పగడాల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.