నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పెట్ లోని కనకదుర్గమ్మ దేవాలయంలో నిర్వహించిన దేవీ నవరాత్రోత్సవాలలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఏడో రోజున అమ్మవారు శ్రీ శ్రీ శ్రీ దుర్గా దేవిగా దర్శనమిచ్చారు. దుర్గా దేవికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నిర్వాహకులు సాయి కృష్ణ గౌడ్, శంతన్, దాత్రినాథ్ గౌడ్, నాయకులు వెంకటేష్, అనంతరాం గౌడ్, ప్రభు గౌడ్, యాదగిరి గౌడ్, సాయి కుమార్, శ్రీనివాస్, ప్రవీణ్, జగన్, రామకృష్ణ, శేఖర్, సుధాకర్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.