నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధి దీప్తిశ్రీ నగర్ లోని శ్రీ ధర్మపురి క్షేత్రం లో దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారు ఏడవ రోజు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, అర్చనలతో విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల తేజస్సుతో ఎరుపురంగు చీరను ధరించి దుర్గామాతగా దర్శనమిస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండగను జరుపుకుంటాం. ఆశ్వియుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తారు.

వివిధ పేర్లతో అలంకారాలు చేసి అమ్మవారి పేర్లు వేరైనా భక్తుల భక్తి ఒకటే నమ్మి కొలిచేవారికి అమ్మవారి అనుగ్రం ఒకటే. కోటి సూర్య ప్రభలతో వెలిగే ఈ వేది భక్తులను సర్వ దుర్గతుల నుంచి కాపాడుతుంది. అమ్మవారు మహా ప్రకృతి స్వరూపిణి, సమస్త దేవీ దేవతా శక్తులు, తేజస్సులు, మూర్తీభవించిన తేజో రూపం, సకల శత్రు సంహారిణి, సర్వ దుఃఖాలను నశింపజేస్తుంది. అదే సమయంలో పరమశాంతమూర్తిగా తనను కొలిచిన భక్తులను కాపాడుతుంది. అష్టమినాడు అమ్మవారిని పూజిస్తే ప్రతి రోజూ ఆరాధించిన ఫలితం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
