నమస్తే శేరిలింగంపల్లి: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని మేడ్చల్ అర్బన్ జిల్లా మహిళా మోర్చా సెక్రటరీ ఉప్పల విద్యాకల్పన ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ లో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో బిజెపి మేడ్చల్ (అర్బన్) జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి పిలుపుమేరకు సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ మహిళలతో కలిసి మేడ్చల్ (అర్బన్) జిల్లా మహిళా మోర్చా సెక్రెటరీ ఉప్పల విద్యా కల్పన హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హుజురాబాద్ బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలను, కుతంత్రలను ప్రజలకు వివరించినట్లు విద్యాకల్పన తెలిపారు. ప్రతి ఒక్కరి నోటా ఈటెల రాజేందర్ మాటనే వినబడుతోందని, రాజేందర్ గెలుపుతో తెలంగాణలో మార్పు రానుందని చెప్పారు. ఈటెల రాజేందర్ గెలుపును ఎవరెన్ని కుట్రలు పన్నినా ఆపలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సంధ్య, ఉపాధ్యక్షురాలు శృతి గౌడ్, సెక్రెటరీ ఉపేంద్ర, కార్యవర్గ సభ్యురాలు శాలిని తదితరులు పాల్గొన్నారు.