నమస్తే శేరిలింగంపల్లి: అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని, అసోసియేషన్ సభ్యుల సహకారం ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఓల్డ్ గచ్చిబౌలి అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీ లోని అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఆరెకపూడి గాంధీ చెప్పారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. కాలనీ వాసులందరికి ఎల్లవేళల అందుబాటులో ఉంటూ కాలనీ సమస్యల పై స్పందిస్తూ, ప్రతి ఒక్కరూ సమిష్టిగా కలిసి కాలనీ అభివృద్ధి కి పాటుపడాలని ఒక ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దే క్రమం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్ , గచ్చిబౌలి అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డ రాజు, నాయకులు నయిమ్, జై సింగ్, కుమార్, గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.