నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ స్వగృహ లో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శనివారం ప్రారంభించారు. రాజీవ్ గృహకల్పలోని ట్రాన్స్ జెండర్స్ కు కరోనా వ్యాక్సినేషన్ పై రాగం నాగేందర్ యాదవ్ అవగాహన కల్పించి వ్యాక్సిన్ వేయించుకునేలా అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, అందులో భాగంగా ఉచిత వ్యాక్సినేషన్ అందిస్తుందని తెలిపారు. వందశాతం వ్యాక్సినేషన్ కాలనీగా రాజీవ్ స్వగృహ నిలవాలని, అర్హులైన ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. శేరిలింగంపల్లి డివిజన్ వ్యాప్తంగా పలుచోట్ల మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించి పర్యవేక్షించారు. ప్రత్యేక శ్రద్ధతో అందరికి వ్యాక్సిన్ అందేలా కృషి చేస్తున్నామని అన్నారు. ట్రాన్స్ జెండర్స్ 25మంది వ్యాక్సిన్ తీసుకున్నారని మిగతా తోటి ట్రాన్స్ జెండర్స్ వ్యాక్సిన్ గురించి తెలియ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబెర్ శ్రీకళ, రవీందర్ రాథోడ్, నరేంద్ర కుమార్, నర్సిములు యాదవ్, నయిమ్ముద్దీన్, మధుసూదన్, రామిరెడ్డి, భూపాల్ రెడ్డి, ట్రాన్స్ జెండర్స్, వెంకటేశ్వర్లు, అలీం, గోపినగర్ బస్తి కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.