నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు మద్దతు ప్రకటించేందుకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. శనివారం బిజెవైఎం రాష్ట్ర నాయకురాలు కసిరెడ్డి సిందురఘునాథ్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీధర్ యాదవ్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రముఖ నాయకులు విచ్చేయుచుండటం సంతోషకరమని అన్నారు. ప్రముఖుల రాకతో కార్యకర్తలను జోష్ పెరుగుతుందని, ఉత్సాహం ఇలాగే కొనసాగితే గడీల పాలన అంతమొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.