శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ డివిజన్ బీజేపీ కార్యదర్శిగా చొవ్వా క్రాంతికుమార్ నియామకం అయ్యారు. ఆయనను పార్టీ డివిజన్ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి నియమించారు. ఈ మేరకు క్రాంతికుమార్ పార్టీ రాష్ట్ర నాయకుడు, శేరిలింగంపల్లి ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ చేతుల మీదుగా నియామకపు పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు, ఆదర్శాలకు పునరంకితమవుతానని, నీతి, నిజాయితీ, నిబద్దత, క్రమశిక్షణ, చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు. డివిజన్ పరిధిలోని నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతానని, డివిజన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తానని అన్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు.