శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): మెడికవర్ హాస్పిటల్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 150 మందికి పైగా వైద్యులు, నర్సులు, ఉద్యోగులు పాల్గొని యోగా నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో యోగా ఇన్‌స్ట్రక్టర్లు దీపక్ ఆసనాలు, ప్రాణాయామాలను ఎలా చేయాలో చూపించి వాటి ప్రయోజనాలను, యోగా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందో, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. ఈ సందర్భంగా సెంటర్ హెడ్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజూ కనీసం 30 నిమిషాలు యోగా చేయాలి. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రోజువారీ జీవితంలో యోగాను అలవర్చుకోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడతాయి. ఇది మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. యోగా జీవనశైలిలో భాగం కావాలి అని పేర్కొన్నారు.