బీజేపీ వైపు చూస్తున్న ప్రజానీక: ర‌వికుమార్ యాద‌వ్‌

శేరిలింగంప‌ల్లి, జూన్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కాంగ్రెస్ పార్టీ పాలనా వైఫల్యం అని, బి.ఆర్.ఎస్ సంస్థాగతంగా శూన్యం అని, ప్ర‌జ‌లంద‌రూ బీజేపీ వైపే చూస్తున్నార‌ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అందరితో కలిసి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాల‌ని నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు. మసీద్ బండ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మాదాపూర్ డివిజన్ సుభాస్ చంద్ర బోస్ నగర్ , కృష్ణ కాలనీల నుండి 50 మందికి పై యువకులు మాదాపూర్ కంటేస్టేడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్ సమక్షంలో, బీజేవైం నాయకుడు రాము యాదవ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా వారికి ర‌వికుమార్ యాద‌వ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంత‌రం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ పార్టీని ప్రజలు పట్టించుకోవట్లేదని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనా వైఫల్యంతో ప్రజలు నమ్మే పరిస్తితుల్లో లేరని అన్నారు.

దేశ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి , దేశ అభ్యున్నతికి తీసుకొచ్చిన సంస్కరణలపై, ప్రపంచ దేశాలతో పోటీపడుతూ దేశ ప్రగతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్ర‌ధాని నరేంద్ర మోదీపై ప్రజలకు అపారమైన నమ్మకం ఏర్పడిందని, తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజన్ సర్కారేనని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అని పార్టీలు మారుతూ వారి స్వయంవృద్ధిని చూసుకుంటూ ప్రజలను , ప్రజా సమస్యలను గాలికినవదిలేసిన ఎమ్మెల్యే, కార్పొరేటర్లపై ప్రజలు విరక్తి చెంది ఉన్నారని అన్నారు. విక్కీ, స్వామి, గోవర్ధన్ గౌడ్ , వసంత్, మధు, అరుణ్, అరవింద్ , చందు, కార్తీక్, సాయి, శివ శంకర్, సిద్దు, మోహన్, పార్థు, గణేష్ , నరేష్, శివాజీ, ఈశ్వర్, సోనూ సింగ్, జస్వంత్ , మనీష్ త‌దిత‌రులు పార్టీలో చేర‌గా ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు వసంత్ యాదవ్, సూర్యవంశీ, వెంకటేష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here