యోగాతో ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలి: తాడిబోయిన రామస్వామి యాదవ్

శేరిలింగంప‌ల్లి, జూన్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కొండాపూర్ కొత్త‌గూడ స‌ఫారిన‌గ‌ర్ న్యూ బ్లూమ్ హైస్కూల్‌లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా యోగా గురువు వి.రామారావు విద్యార్థుల‌చే యోగాస‌నాలు వేయించారు. అనంత‌రం అసోసియేష‌న్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, యోగా గురువు రామారావు మాట్లాడుతూ యోగా అనేది ఆరోగ్య కరమైన జీవనశైలి. అందరూ ఆ ఆరోగ్యకరమైన జీవనశైలికోసం యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలి, యోగ సాధన వలన కలిగే అనేక ప్రయోజనాల గురించి ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ప్ర‌ధాన ఉద్దేశ్యం అని అన్నారు. యోగా కేవలం ఫిట్ నెస్ కోసం మాత్రమే కాదు, యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, సమతుల్యతను పెంచుతుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ కిరణ్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here