శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లోని శ్రీదేవి థియేటర్ రోడ్డుకు వెంటనే మరమ్మత్తులు చేయాలని చందానగర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పారునంది శ్రీకాంత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయిబాబా మాట్లాడుతూ శ్రీదేవి థియేటర్ నుండి రాజేందర్ రెడ్డి కాలనీ వైపు వెళ్ళే రోడ్డు అస్తవ్యస్తంగా మారిందని, దీనివల్ల వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రోడ్డు అడుగడుగునా గుంతలే ఉన్నందున ద్విచక్ర వాహనదరులు ముఖ్యంగా మహిళలు వాహనం అదుపు తప్పి కింద పడిపోవడం గాయల పాలవడం జరుగుతుందన్నారు. వర్షా కాలం కనుక మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని రోడ్డు మరమ్మత్తు పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు పారునంది శ్రీకాంత్, మిద్దెల మల్లారెడ్డి, రవి యాదవ్, సతీష్ రావు, వాల హరీష్ రావు, కిరణ్ యాదవ్, గోపరాజు శ్రీనివాస్ రావు, రామకృష్ణ గౌడ్, ఎండీ సలీమ్, మల్లేష్ యాదవ్, దొంతి చిన్న, ఎండీ అప్సర్, ఉపేందర్, రవి తేజ, మనోహర్ రెడ్డి, బాబు మోహన్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.