శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసిన మహానుభావుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్థంతి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్ శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రాంగణంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతానికి పునాది వేసిన జయశంకర్ కృషిని స్మరించుకోవడం జయశంకర్ ఆదర్శాలు తెలంగాణ యువతకు మార్గదర్శకం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కే ఎన్ రాములు, ప్రభాకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, గడ్డం శ్రీనివాస్, చర్య, గంగాధర్ గౌడ్, సుమన్, జమ్మయ్య, శ్రీకాంత్ యాదవ్, మల్లేష్, బస్వారాజ్, డాక్టర్ రవికుమార్, సాయి నందన్ ముదిరాజ్, పవన్, స్వామి ముదిరాజ్, నవీన్ గౌడ్, రాజు గౌడ్, మున్నా, శంకర్, శ్రీనివాస్, రమా దేవి, స్వరూప, శశికళ, ఆశ మారాజు, దివ్య, నిరూప, సునంద, శివాజీ, సురేష్ యాదవ్, మహేష్, ప్రవీణ్, రాకేష్ ,లడ్డు, శ్రీశైలం యాదవ్, కృష్ణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.