శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హఫీజ్‌పేటలో ఉన్న హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సభ్యులు పలు యోగాసనాలు వేశారు. అలాగే సూర్య నమస్కారాలు చేశారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని చాటి చెపుతూ యోగా ఆవశ్యకతను వివరించారు.