శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీదేవి థియేటర్ నుండి అమీన్ పూర్ వరకు రూ. 45 కోట్ల అంచనావ్యయంతో నూతనంగా నిర్మించనున్న రోడ్డును PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శ్రీదేవి థియేటర్ నుండి అమీన్ పూర్ వరకు రూ. 45 కోట్ల అంచనావ్యయంతో నూతనంగా నిర్మించనున్న రోడ్డుకు 25.06.2025 బుధవారం రోజున ఉదయం 10.00 గంటలకు IT , పరిశ్రమ, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని అన్నారు. రోడ్డు విస్తరణ పనులపై చేపట్టాల్సిన చర్యలపై చర్చించామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘుపతి రెడ్డి, నాగిరెడ్డి, మహిపాల్, ప్రసాద్, సందీప్ రెడ్డి , కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీల వాసులు తదితరులు పాల్గొన్నారు.