శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటిన మహాజ్ఞాని, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అంజమ్మ, మాధవి, దార్గుపల్లి నరేష్, నారాయణ, రమేష్ గౌడ్, నరేష్ సింగ్, అలీం, తాహెర్, బురాన్ తదితరులు పాల్గొన్నారు.