శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చందానగర్‌లోని సరస్వతి విద్యా మందిర్ లో 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక యోగా ప్రాక్టీస్ సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. పాఠశాల పి.ఇ.టి. భవాని, హెడ్ మాస్టర్ అరుణ, జాయింట్ సెక్రటరీ రామచంద్రారెడ్డి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఎంతో కృషి చేశారు. విద్యార్థులకు ప్రాముఖ్యతను తెలియజేయడమే కాకుండా, వారి దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ యోగా సెషన్ విద్యార్థులలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఎంతగానో తోడ్పడుతుందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.