శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఆ మహనీయుని వర్ధంతిని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ లోని జయశంకర్ సర్కిల్ లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి ప్రొఫెసర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో ప్రజల వెన్నంటి ఉండి రాష్ట్రసాధనలో భాగస్వాములయ్యారని చెప్పారు. తెలంగాణ సాధనే ఊపిరిగా శ్వాస ఉన్నంతవరకు ఉద్యమించారని కొనియాడారు. ఒక భారతీయ విద్యావేత్త, సామాజిక కార్యకర్త అని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అడుగు జాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, వార్డ్ మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావు, యాదాగౌడ్, గోవింద్ చారీ, కే రాంచందర్, భేరి రాంచందర్ యాదవ్, సంగారెడ్డి, సాయన్న, నిరంజన్, పద్మారావు, గోపాల్ యాదవ్, బస్వయ్య, రాజ్ కుమార్, శ్రీనివాస్, యాదగిరి, సుధాకర్, సత్యనారాయణ, నరసింహ, సుధాకర్ రెడ్డి, రవీందర్, మహేష్ చారీ, మల్లేష్ యాదవ్, నయీమ్, కృష్ణ, నటరాజ్, తుకారామ్, అనిల్, పంచాంక్షరీ యాదవ్, మహిళా నాయకురాళ్లు సౌజన్య, భాగ్యలక్ష్మి, కుమారి, లక్ష్మి, జయ, సుధారాణి, గౌసియా, కళ్యాణి, ముంతాజ్ బేగం, జయమ్మ, తదితరులు పాల్గొన్నారు.