నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో జన్మదినాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ శేరిలింగంపల్లి యువజన విభాగం నాయకుడు, ప్రముఖ న్యాయవాది దొంతి కార్తీక్ గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చందానగర్ పోలీస్ స్టేషన్ లోని మొత్తం సిబ్బందికి కార్తీక్ గౌడ్ శానిటైజర్ లను అందజేశారు. ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, వారికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గం జనార్ధన్ గౌడ్ తదితరులు ఉన్నారు.