కుల‌వృత్తుల వారిని ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం: తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల ఐక్యవేదిక

నమస్తే శేరిలింగంపల్లి: కులవృత్తుల పైనే ఎన్నో ఏళ్లుగా ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని ఆదుకోవడంలో ప్రభుత్వాలు విపలం అవుతున్నాయని తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల ఐక్య వేధిక అధ్యక్షుడు వేముల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఉప్పరి శేఖర్ సాగర్ పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కుల వృత్తులలో ప్రధానంగా చేతివృత్తులను గుర్తించి వాటి అభివృద్ధికి తోడ్పాటునందిస్తూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలోని అప్పటి ప్రభుత్వాలు ఫెడరేషన్లను ఏర్పాటు చేశాయన్నారు. కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు నిధులు కేటాయించి పనిముట్ల కు సబ్సిడీ ఋణాలు అందజేయడంతో ఆయా కులవృత్తుల మీద ఆధారపడ్డ లక్షలాది మంది జీవనోపాది పొందారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫెడరేషన్లను తొలగించి ఆయా కులాలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేసి వాటికి పాలక మండళ్లను ఏర్పాటు చేస్తారని ఆశించామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేయకపోగా ఉన్న ఫెడరేషన్లకు సైతం నిధులు కేటాయించకుండా కులవృత్తుల పై ఆధారపడ్డ జాతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని వాపోయారు. అధిక సంఖ్యలో ఉన్న కొన్ని కులాలను మాత్రమే ప్రభుత్వం పట్టించుకుని వరాలు కురిపిస్తూ వెనుకబాటుకు గురైన కులాలను పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన దళితబందు పథకం లాంటి పథకాలను బిసి ఫెడరేషన్ కులాలకు సైతం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా వెనుకబడిన జాతులకు చేయూతనందించేందుకు ఫెడరేషన్ లు కలిగిన ఒక్కొక్క కులానికి 100 కోట్ల చొప్పున బడ్జెట్ విడుదల చేయాలని, కులవృత్తుల మీద ఆధారపడిన ఫెడరేషన్ కులాలకు వెంటనే కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి వాటికి పాలక వర్గాలను నియమించాలని, ఫెడరేషన్ కులాలకు ఒక రాజ్యసభ, ఒక ఎమ్మెల్సీ కేటాయించాలని తదితర న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు. న్యాయమైన డిమాండ్ల పై ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేని పక్షంలో ఫెడరేషన్ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని తెలిపారు.

తెలంగాణ బీసీ ఫెడరేషన్ ‌కులాల ఐక్యవేదిక సమావేశంలో మాట్లాడుతున్న ‌ప్రధాన కార్యదర్శి ‌ఉప్పరి శేఖర్‌ సాగర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here