గాంధీ రాజీనామాతోనే శేరిలింగంప‌ల్లి అభివృద్ధి సాధ్యం: అమ‌ర్‌నాథ్ యాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ప్ర‌భుత్వ విప్‌, శేరిలింగంప‌ల్లి శాస‌న‌స‌భ్యులు ఆరెక‌పూడి గాంధీ త‌న ప‌ద‌వికి రాజీనామ చేస్తే త‌ప్ప నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి చెంద‌న‌ని బిజెవైఎం శేరిలింగంప‌ల్లి క‌న్వీన‌ర్ అమ‌ర్‌నాథ్ యాద‌వ్ పేర్కొన్నారు. రాయ‌దుర్గం ల‌క్ష్మీన‌ర్సింహ స్వామి బ‌స్తీలో ఆదివారం అమ‌ర్‌నాథ్ యాద‌వ్ ప‌ర్య‌టించారు. స్థానికంగా నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను బ‌స్తీ వాసులు ఆయ‌న‌కు వివ‌రించారు. ప్ర‌ధానంగా డ్రైనేజీ పైప్‌లైన్ ప‌గిలి తాగునీటిలో మురుగునీరు క‌లుస్తుంద‌ని తెలిపారు. దీంతో స్థానికులు రోగాల భారిన ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో స్పందించిన అమ‌ర్‌నాథ్ యాదవ్ మాట్లాడుతూ గాంధీ హయాంలో శేరిలింగంప‌ల్లిలో స‌మ‌స్య‌లు విల‌య‌తాండ‌వం చేస్తున్నాయ‌ని, ఈటెల రాజేంద‌ర్ రాజీనామాతో హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రూపురేఖ‌లు మారుతున్నాయ‌ని, గాంధీ రాజీనామ చేస్తే శేరిలింగంప‌ల్లి అభివృద్ధి ప‌దంలో న‌డుస్తుంద‌ని అన్నారు. ఇప్ప‌టికైన అధికారులు స్పందించి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు.

రాయ‌దుర్గంలో ల‌క్ష్మీన‌ర్సింహ బ‌స్తీ వాసుల‌తో అమ‌ర్‌నాథ్ యాద‌వ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here