నమస్తే శేరిలింగంపల్లి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీలో అధికారులతో కలిసి పర్యటించిన ఆమె స్థానికంగా నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ది పనులపై చర్చించారు. అనంతరం మంజుల రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ కాలనీలు, బస్తీలను పరిశుభ్రంగా ఉంచి వ్యాధులు ప్రబలకుండా చూసే లక్ష్యంతో ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ సహకారంతో చందానగర్ డివిజన్ ఆదర్శవంతగా కృషి చేస్తున్నానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డిప్యూటీ కమిషనర్ సుధాంశ్, డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు గురుచరణ్ దుబే, జనార్దన్ రెడ్డి, రవిందర్ రెడ్డి, అక్బర్ ఖాన్, దాసు రాజశేఖర్, అవినాష్ రెడ్డి, సందింప్ రెడ్డి, యుసుప్, కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.