నమస్తే శేరిలింగంపల్లి: తారానగర్ మార్కెట్ రోడ్‌లో నూతనంగా 26 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కాగా మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు గురువారం ముఖ్య అతిథిగా హాజరై తారానగర్‌లో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులకు ప్రజల సహకారం తోడవుతే రక్షణ విషయంలో పకడ్భందీగా ముందుకు సాగవచ్చని అన్నారు. సీసీ వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, నివాస గృహాలు, ప్రధాన కూడళ్లు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తారానగర్ మార్కెట్ రోడ్‌లోని వ్యాపారులు 26 సీసీ కెమెరాల ఏర్పాటుతో ఇతరులకు ఆదర్శంగా నిలిచారని అభినందించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రాసద్, ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో, ఎస్ఐలు అహ్మద్ పాషా, రాములు, స్థానిక వ్యాపారవేత్త సీవైజీ యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.