నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్‌లో గురువారం శ్రీ కనక దుర్గ పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు యం.రవి కుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజువారి జీవితంలో అలసి పోతున్న జీవికి ఆలయం ఒక శక్తి వలయమని అన్నారు. మనిషిలో కూరుకుపోయిన నిస్సత్తువను, ఒత్తిడిని దూరం చేసి మానసిక ప్రశాంతత ఇస్తాయని అన్నారు. అక్కడ రోజు చేసే వేదఘోష నెగటివ్ వైబ్రేషన్‌ను దూరం చేసి దైవానుగ్రహాన్ని ప్రసాదిస్తుందని అన్నారు. దేవతాశక్తులే మంత్ర రూపంలో, ఆ మంత్రాలే వేదఘోషలో మనుషులను కాపాడతాయని, మానసికంగా ప్రశాంతత, ఆధ్యాత్మికంగా ఉన్నతి రెండూ కలుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి చైర్మన్ నరసింహ సాగర్, జనరల్ సెక్రెటరీ గోవర్ధన్, ఆలయ కమిటి సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.