ఆకలి తీర్చడమే సేవ ధ్యేయం: అట్టేపల్లి రామప్రభు

శేరిలింగంప‌ల్లి, జూన్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్నదానం మహాదానం అనే స్ఫూర్తితో అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఏడవ వారపు అన్నదాన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ట్రస్ట్ చైర్మన్ అట్టేపల్లి రామప్రభు నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలకు భోజనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధి అట్టేపల్లి పురుషోత్తం మాట్లాడుతూ, అవసరమైన వారికి ఆహారం అందించి వారి ఆకలిని తీర్చడం ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. సమాజ సేవే ప్రధాన లక్ష్యంగా ట్రస్ట్ తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో శ్రీరాములు, అజయ్, వినీత్, కరుణాకర్, శివయ్య, సతీష్, రాంచరణ్, నాగేష్, రామబాణం, వసంత, సౌఖ్య, శోభారాణి, కల్పన, కవిత, జ్యోతి, అరుణ, భావనతోపాటు అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, ఏఆర్‌పీ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here