- పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్ లో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆలయ నిర్వాహకులు కార్పొరేటర్ కి బోనాల డప్పులతో స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. బోనాల మహోత్సవాళ్లలో డప్పు చప్పళ్లు, ఒగ్గు డోలు విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో బోనాల పండుగ జాతరను తలపించింది. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి పట్నాలు వేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల పండుగను అధికార పండుగగా ప్రకటించడం జరిగిందన్నారు. ఈ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. అమ్మవారి ఆశీస్సులు, చల్లని దీవెనలు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, కటిక రామ్ చందర్, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్, ఖాజా పాషా, రామ్ చందర్ యాదవ్, అజీమ్, సాయి, మార్కెట్ కమిటీ సభ్యులు, చిరు వ్యాపరులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.