నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ కూకట్ పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్, మాదాపూర్ డివిజన్ పరిధి అయ్యప్ప సొసైటీలోని వై.యస్.రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఏ.ఐ.సి.సి ప్రధాన కార్యదర్శి జే.కుసుమ కుమార్, ఎంబీసీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్, నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావు, ఇతర పార్టీ శ్రేణులతో కలిసి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ వై.యస్.రాజశేఖర రెడ్డి ప్రజలందరికీ మేలు చేసేలా పరిపాలన సాగించారని, అందరికీ అన్ని పథకాలు అందాలనే దృఢ సంకల్పంతో ఆయన పాలన సాగిందని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతీ కార్పొరేట్ వైద్యం పేదలందరికీ అందించిన మహానుభావుడు అని, పావలా వడ్డీ రుణాలు, 108 అంబులెన్సులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణ మాఫీ, జలయజ్ఞం, వ్యవసాయానికి ఉచిత కరెంటు వంటి పథకాలతో పేదవారికి ఎంతో సాయం అందించారని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మహిపాల్ యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు సురేష్ నాయక్, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు బాష్పక యాదగిరి, అల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు మరేళ్ల శ్రీనివాస, నాయకులు ఏకాంత్ గౌడ్, ఆనంద్, నగేష్ నాయక్, వెంకటేష్ యాదవ్, గోపాల్ నాయక్, వెంకన్న, పట్వారీ శశిథర, బసవరాజు పాల్గొన్నారు.