శేరిలింగంపల్లి, మార్చి 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ గచ్చిబౌలి విలేజ్ స్ట్రీట్ నెం. 2 లో నూతనంగా నిర్మాణం చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సీసీ రోడ్డు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. నాణ్యతతో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన డ్రైనేజీ పనులను కూడా పూర్తి చేసి ఎమ్మెల్యే గాంధీ సహకారంతో త్వరలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ఏఈ నిఖిల్, వాటర్ వర్క్స్ మేనేజర్ సందీప్ కుమార్, గచ్చిబౌలి విలేజ్ ప్రెసిడెంట్ సయ్యద్ నయీమ్, ఆఫ్జల్, గడ్డ సదానంద్, శివ, గడ్డ గణేష్, రహీం, ప్రవీణ్, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.






