- భూ ఆక్రమణలకు యత్నం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన సంగీతకి బెయిల్
- హాట్ టాపిక్ గా మారిన బెయిల్ మంజూరు
నమస్తే శేరిలింగంపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మియాపూర్ భూముల ఆక్రమణల కేసులో కీలక పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. మియాపూర్ సర్వే నెంబర్ 100, 101లలో ఆక్రమణలకు యత్నించిన వారు పోలీసుల మీద రాళ్లదాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన మొత్తం 83 మందిపై కేసులు పెట్టి 60 మందిని అరెస్ట్ చేశారు. మరో 23 మంది అప్ స్కాండింగ్ లో ఉన్నారంటూ పోలీసులు ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేసినట్లు సమాచారం.
భూ ఆక్రమణలకు ఆజ్యంపోసి, పోలీసులపై దాడులకు యత్నించడంలో కీలక భూమిక పోషించిన సంగీతపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులపై హత్యాయత్నంతోపాటు, భూ ఆక్రమణలకు యత్నం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిందని, స్థలాలు ఇప్పిస్తానని మోసం చేసిందంటూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఆమెను ఏ1 గా పేర్కొన్నారు. మియాపూర్ గొడవల అనంతరం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఇంతటి ఘటనకు కారణమైన సంగీతకు తాజాగా బెయిల్ మంజూరవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంత త్వరగా బెయిల్ రావడం వెనక ఎవరున్నారన్నది చర్చానీయాంశమైంది.