శేరిలింగంపల్లి, మార్చి 6 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ శశిరేఖ ఆధ్వర్యంలో అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్లో ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేస్తామని అన్నారు.






